‘టీఆర్ఎస్‌ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డయ్’

by Shyam |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర తీసుకొచ్చిన నల్ల చట్టాలకు టీఆర్ఎస్ మద్దతిస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో జరిగిన రహస్య ఒప్పందంలో భాగంగానే రైతులకు ఇరు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రైతులు మేల్కోవాలని, ఓటు హక్కుతో ద్రోహులకు సరైన బుద్ధి చెప్పాలని సూచించారు.

Advertisement

Next Story