- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించాలి’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాకం గాంధీ వాద్రాను ఉత్తర్ ప్రదేశ్ సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించాలని పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం పిలుపునిచ్చారు. అందుకే ఆమె యూపీ రాజధాని లక్నోకు తరలాలని, అక్కడి నుంచే రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతబూనుకోవాలని ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునరుజ్జీవనం ఉత్తర్ ప్రదేశ్ నుంచి మొదలవ్వాలని సూచించారు. అందుకే ప్రియాంక గాంధీ వాద్రా లక్నోకు బస మార్చుకోవాలని, అక్కడి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై ఆమె పలుమార్లు తీవ్రంగా దాడి చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఈ సూచనలను వెల్లడించారు. కాగా, దేశరాజధానిలో ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీ వాద్రాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన తరుణంలో కార్తీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.