అహ్మద్ పటేల్‌ను విచారించిన ఈడీ

by Shamantha N |
అహ్మద్ పటేల్‌ను విచారించిన ఈడీ
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్‌ను ఈడీ అధికారులు శనివారం ఆయన నివాసంలో విచారించారు. సందేసరా సోదరుల మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు ఈడీ పలుసార్లు సమన్లు పంపింది. కానీ, కరోనా కారణంగా పెద్ద వయస్కుడైన తాను బయటికి రావడం కుదరదని అహ్మద్ పటేల్ సమాధానమిచ్చారు. దీనికి బదులుగా తామే ఇంటికి వచ్చి వాంగ్మూలం తీసుకుంటామని తెలిపిన ఈడీ, శనివారం ఢిల్లీలోని తన నివాసానికి ముగ్గురు అధికారుల బృందం వెళ్లింది. ఈ కేసులో అహ్మద్ పటేల్‌ను ప్రశ్నించారు.

Advertisement

Next Story