బ్రేకింగ్.. మౌన నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

by Sridhar Babu |   ( Updated:2021-10-13 00:47:04.0  )
vh-4
X

దిశ, అంబర్ పేట్: కేంద్ర హోం సహాయ మంత్రి అజిత్ మిశ్రాను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ రైతులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ.. బాగ్ అంబర్ పేట్ లోని తన నివాసంలో మౌన నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. పండించిన పంటకు సరైన న్యాయం జరగాలని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీని అడ్డుకోవడం సరికాదన్నారు. రైతుల మరణానికి కారణమైన మంత్రి కొడుకుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డిలు వీహెచ్ ను కలిసి సంఘీభావం తెలపనున్నారు. అనంతరం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed