కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు

by Shyam |
కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. శనివారం హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఎన్నికల్లో అయినా గెలుపోటము సహజం అని అన్నారు. ఓటమిపై అందరం కూర్చొని సమీక్షించుకుంటామని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ ఎల్లవేళలా అందరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం పార్టీలు లబ్ధిపొందాయని విమర్శించారు. కాంగ్రెస్ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. సరైన ప్రణాళికతో ముందుకువెళ్తామని తెలిపారు.

Advertisement

Next Story