- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫైర్..
దిశ, హైదరాబాద్
కాంగ్రెస్ ఎంపీ రెవంత్ రెడ్డిపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జీవో 111, మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ విషయంలో ఎంపీ రేవంత్ చేస్తున్న పోరాటం.. ఆయన వ్యక్తిగతమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. రేవంత్ పై వచ్చిన భూ ఆరోపణలను కప్పి పుచ్చుకునేందుకు ఇలా ఇంకో అంశం తెరపైకి తేవటం సరికాదని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఎలాంటి అంశమైనా పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఎవరికి వారుగా కార్యక్రమాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ చేసిన పోరాటం గురించి తమకేమీ తెలియదని చెప్పారు.
జీవో 111 అంశాన్ని టీపీసీసీ చీఫ్ పదవికి లింకు పెట్టి రేవంత్ రెడ్డి అనుచరులు తీవ్ర రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ మరోనేత, ఎమ్మేల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ ఒక్కడే మగాడని, కాంగ్రెస్ లో హీరోలే లేరంటూ వారు చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టల్సిన అవసరం ఉందన్నారు. కొన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్న నేతలను ఇబ్బంది పెట్టేలా రేవంత్ వ్యవహరించటం మంచి పద్దతి కాదని సూచించారు. ఈ అంశాలపై చర్చించేందుకు వెంటనే టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యవస్థ అని, దీనిని అనేక మంది నాయకులు, కార్యకర్తలు నమ్ముకుని ఉన్నారని వివరించారు.
Tags: Congress leaders fires on Revanth Reddy,mla jagga reddy, congress senior leader v hanumantha rao, He asked the High Command to discuss it