- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
45 మృతుల కుటుంబాలకు సాయం..
by Sridhar Babu |

X
దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ రెడ్డి కరోనా మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఏకంగా 45 మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. మండల పరిధిలోని పిల్లయిపల్లి, దేశముఖి, ఇంద్రియాల, పెద్ద రావుల పల్లి, శివారెడ్డి గూడెం గ్రామాల్లో పర్యటించి.. కరోనా, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. తన సొంత డబ్బుల్లో నుంచి రూ. 4 లక్షల నగదును 45 కుటుంబాలకు పంచారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో దేశముఖి గ్రామం నుంచి పలువురు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
Next Story