- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వైన్ షాపుల పై చర్యలు తీసుకోండి..
దిశ, చెన్నారావుపేట: మండల కేంద్రంలో ఉన్న తిరుమల, రాజన్న వైన్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుఖ్య గోపాల్ నాయక్ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. ఫుల్ బాటిల్ ను ఎం.ఆర్.పీ ధర కంటే అధికంగా రూ.80కి అమ్ముతున్నారని ఆరోపించారు. అధిక ధరలతో ప్రజల పైన భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదన్నారు. తహసీల్ధార్, ఎక్సైజ్ సి.ఐ , స్థానిక ఎస్.ఐ లకు ఫిర్యాదు చేశామన్నారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఇక ముందు ఎం.ఆర్.పీ రేట్ల కంటే అధిక ధరలకు అమ్మితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైన్ షాపుల ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తల్లపెల్లి నర్సయ్య గౌడ్, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్, లక్క రాజు, మాధసి మల్లయ్య, రవి, రవీందర్ నాయక్, లక్క విజేందర్, బొంద్యాలు, హంస నవీన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.