నిద్రిస్తున్న వారిపై దాడిచేయడమేంటి.. పది రోజుల్లో వారిని సస్పెండ్ చేయాలి

by Shyam |
Congress leader Vamsi Krishna
X

దిశ, అచ్చంపేట: అటవీ ఉత్పత్తులైన ఇప్పపువ్వు సేకరణకు వెళ్ళిన లంబాడా గిరిజనులపై అటవీశాఖ అధికారులు విచక్షణ రహితంగా దాడి చేయడంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విషయం తెలుసుకున్న వెంటనే వంశీకృష్ణ మన్ననూరు గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులు అడవికి ఏమైనా నష్టం చేశారా?, వారి వల్ల వచ్చిన నష్టం ఏముంది, నిద్రిస్తున్న వారిపై దాడి చేయడం అటవీశాఖ ఆగడాలకు అద్దం పడుతుందని మండిపడ్డారు. డీఎఫ్ఓ, ఎఫ్‌డీఓ వచ్చిన తర్వాత ఆగడాలు మరింత అధికమయ్యాయని ఆరోపించారు. దాడి చేసిన గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందించాలని, అంతేగాకుండా.. బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన అటవీశాఖ సిబ్బందిపై ఉన్నతాధికారులు స్పందించి, వారిని పది రోజుల్లో వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed