ఆమె అవకాశం ఇవ్వడంతోనే.. పీవీ ప్రధాని అయ్యారు

by Anukaran |   ( Updated:2020-07-19 11:25:54.0  )
ఆమె అవకాశం ఇవ్వడంతోనే.. పీవీ ప్రధాని అయ్యారు
X

దిశ, వెబ్ డెస్క్: భాతర మాజీ ప్రధాని పీవి నరసింహా రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన వీపీ శతజయంతి ఉత్సవాల సమీక్షా సమావేశంలో ఆయన పీవీపై వీహెచ్ కామెంట్స్ చేశారు. పీవీ నరసిహారావుకు కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చిందన్నారు. సోనియాగాంధీ అవకాశం ఇచ్చినందువల్లే వీపీ దేశానికి ప్రధాని కాగలిగారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి సోనియా గాంధీని వీపీ కుటుంబ సభ్యులు విమర్శించడం సరికాదని హితవు పలికారు. గాంధీ భవన్‌లో వైఎస్ జయంతి, వర్థంతి నిర్వహించినట్టే, ఇతర నాయకులవి కూడా నిర్వహించాలని అన్నారు. వచ్చే ఏడాది దామోదరం సంజీవయ్య శతజయంతి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు.

Advertisement

Next Story