సీఎం అంటే గౌరమే..కానీ ప్రశ్నిస్తా: సచిన్ పైలట్

by Shamantha N |
సీఎం అంటే గౌరమే..కానీ ప్రశ్నిస్తా: సచిన్ పైలట్
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభం కొల్కివచ్చినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంగళవారం పైలట్ భేటీ అయ్యారు. అనంతరం పైలట్ మీడియాతో మాట్లాడారు. తన సమస్యలను రాహుల్, ప్రియాంక ఓపిగ్గా విన్నారని తెలిపారు. తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. అవి వస్తూపోతూ ఉంటాయని..వాటి గురించి ఆలోచించకుండా ప్రజల విశ్వాసం చూరగొనేలా పనిచేస్తానని అన్నారు. సీఎం అశోక్ గెహ్లాట్‌పై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే సమస్యలపై ప్రశ్నించే హక్కు తనకుందన్నారు. రాజకీయాల్లో అసూయ, వ్యక్తిగత శతృత్వం వంటి వాటికి స్థానంలేదన్నారు.

Advertisement

Next Story