- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనా ఆర్మీ ఎల్‌ఏసీ వద్దే కాచుకుని ఉంది : చిదంబరం
దిశ, వెబ్‌డెస్క్: ఒక్క అంగుళం భారత భూభాగాన్ని కూడా ఎవరూ ముట్టుకోలేరంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్ అటాక్ చేశారు. రాజ్‌నాథ్ వాక్చాతుర్యానికి ఇది నిదర్శనమన్నారు. భద్రతా సంస్థల అంచనాల ప్రకారం చైనా బలగాలు ఎల్ఏసీ వద్దే భారత భూభాగంలో ఇప్పటికీ తిష్ట వేసుకుని ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు.
‘చైనా బలగాలు ఇప్పటికీ ఎల్ఏసీ వెంబడి 1.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోనే ఉన్నాయని భారత భద్రతా సంస్థలు అంచనా వేశాయి. గత మేలో చైనా బలగాలు భారత్‌లోకి 5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చాయి’ అని ఒక ట్వీట్‌లో చిదంబరం పేర్కొన్నారు. భారత భూభాగంలో చొరబాటుదారులెవరూ లేరని రక్షణ మంత్రి చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వాస్తవాలను ప్రభుత్వం గుర్తించనంత వరకూ యథాపూర్వ పరిస్థితి అనేది ఎండమావేనని చిదంబరం ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.