ఏ నిర్ణయం తీసుకున్నా.. ఈటల వెంటే : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Shyam |   ( Updated:2023-04-01 17:58:19.0  )
ఏ నిర్ణయం తీసుకున్నా.. ఈటల వెంటే : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో గురువారం రాత్రి భేటీ అయ్యారు. భూ కబ్జా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలను ఓదార్చడానికే కలిశానని కొండా వెల్లడించారు. ఈటలతో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చించలేదని అన్నారు. జమున తమకు బంధువు అని, ఈటల నాకు మంచి మిత్రుడు అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంతో ఈటలకు జరిగిన నష్టమేమీ లేదని అన్నారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్ట చేశారు.

Advertisement

Next Story