- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరూ దొంగలే.. ఐటీఐఆర్‌పై కొత్త నాటకాలు : దాసోజు శ్రవణ్
దిశ, తెలంగాణ బ్యూరో : ఐటీఐఆర్ సాధించేందుకు డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ సిద్ధమేనా అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గాంధీభవన్ లో గురువారం దాసోజు శ్రవణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగ యువతపై బీజేపీ, టీఆర్ఎస్ కి చిత్తశుద్ది లేదన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేసైనా, మభ్యపెట్టైనా సరే గెలవాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఉద్యోగ నియామకాలు, ఐటీఐఆర్ మీద బండి సంజయ్, కేటీఆర్ లు ఒకరిపై ఒకరు లేఖలు రాసుకుంటూ హై డ్రామా నడిపిస్తున్నారన్నారు.
ఈ డ్రామాలను గ్రాడ్యుయేట్లందరూ నమ్మకూడదని ఆయన కోరారు. ఐటీఐఆర్ పై కేంద్ర మద్దతును కోరకుండా, పార్లమెంటులో దీని గురించి ప్రశ్నించకుండా ఇప్పుడు తెర మేదకు తెచ్చి నానా హైరానా సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడ్డామని చెప్పుకోవడమే తప్ప ఐటీఐఆర్, భయ్యారం స్టీల్ ప్లాంట్,కాజీపేట రైల్వే కోచ్ వంటి అంశాలపై బీజేపీ ముందుకు రాకపోవడం సరికాదన్నారు. మౌలిక వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు కాగ్ నివేదిక ప్రకటించినప్పుడు ఇప్పటి వరకూ ఎందుకు చెప్పలేదని ఎంపీ బండి సంజయ్ ని ప్రశ్నించారు. ఐటీఐఆర్ వస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి, దాన్ని సాధించేందుకు ముందుకు రాకుండా ఎన్నికల వేల ఈ అంశాన్ని వాడుకోవడం సరికాదన్నారు.
నిజంగా టీఆర్ఎస్ కి ఐటీఐఆర్ పై చిత్త శుద్ధి ఉంటే రూ.13వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తుందని జీవోతో కూడిన ప్రకటన చేయాలని ఆయన కోరారు. అరవై లక్షల ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.13వేల కోట్లు ఎందుకు కేటాయించలేకపోయిందని శ్రవణ్ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తెలంగాణ బిడ్డల కోసం ఎవరి కాళ్లు అయినా పట్టుకొని ఐటీఐఆర్ మాత్రం ఏర్పాటు చేద్దామని ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్ఎస్ ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకోడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.