‘కాంగ్రెస్‌పై నమ్మకం వచ్చింది.. టీఆర్ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయ్’

by Shyam |
‘కాంగ్రెస్‌పై నమ్మకం వచ్చింది.. టీఆర్ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయ్’
X

దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అందుకు నిదర్శనం మంగళవారం పాలమూరు గడ్డపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అధ్యక్షతన జరిగిన విద్యార్థి నిరుద్యోగ సభే అని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. రేవంత్ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువతకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలను చైతన్యం చేయడంలో భాగంగా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు ప్రజల ముందుకు తీసుకుని వెళ్లడం కోసం జంగ్ సైరన్ నిర్వహించామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అనేక ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి యువకులు, విద్యార్థులతో కలసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధం అయిందన్నారు. కాంగ్రెస్ పై ప్రజలకు, యువతకు కూడా విశ్వాసం కలిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో అందరి ఆశయం కోసం కాంగ్రెస్ పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్ర కుమార్, ప్రచార కార్యదర్శి సీజే బెనహార్, మాజీ కౌన్సిలర్ బాలస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story