- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధరణి పేరుతో కుట్రలు….
దిశ, దుబ్బాక :
పేదలకు ఇచ్చిన భూములను ధరణి పేరుతో రిటర్న్ తీసుకునేందుకు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తు కు ఓటేసి దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అనీ, తెచ్చింది తామని అన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని తెలిపారు. 2015లో అన్ని సర్వే లు చేసిన ప్రభుత్వం మళ్లీ ధరణి పేరుతో ఎందుకు సర్వే చేస్తోందని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా వచ్చిన పేదోనికి పెళ్ళాం పుస్తే అమ్ముకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.