- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ కొవిడ్-19 రిలీఫ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ: కరోనా సహాయక చర్యల సమన్వయం, ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను అన్వేషించడానికి ఆ పార్టీ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా తమ పార్టీ నిర్వహిస్తున్న కరోనా సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు వీలుగా మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో కొవిడ్-19 రిలీఫ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో తెలిపింది.
ఇందులో అంబికా సోనీ, ముఖుల్ వాస్నిక్, పవన్ కుమార్ భన్సాల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జై రాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా,మనీష్ చత్రాత్, డాక్టర్ అజేయ్ కుమార్, పవన్ ఖేరా, గురుదీప్ సింగ్ సప్పాల్, బీవీ శ్రీనివాస్ లు ఉన్నట్టు చెప్పింది. కాగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను అంచనా వేసేందుకు గాను అశోక్ చవాన్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ పేర్కొంది. ఇంకా ఈ బృందంలో సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, విన్సెంట్ హెచ్ పాలా, జోతి మణి ఉన్నట్టు వెల్లడించింది.