- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలిరోజు రిజిస్ట్రేషన్లలో గందరగోళం
దిశ, తెలంగాణ బ్యూరో: పాత పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తొలిరోజు గందరగోళంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అంటూ పేచీ పెట్టకుండా లావాదేవీలకు అనుమతి ఇవ్వాలంటూ నిరసన గళం వినిపించింది. చాలా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు రియల్టర్లు, ప్లాట్ల యజమానులు ధర్నాలు చేశారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు నిరసనకు మద్దతు పలకడం గమనార్హం. కొన్ని కార్యాలయాల్లో సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అఖిలపక్షం నిరసనలో పాల్గొంది. టీఆర్ఎస్నేతలు, ప్రజా ప్రతినిధులు ఎల్ఆర్ఎస్, జీఓ 111లకు వ్యతిరేకంగా నినదించారు. అక్కడికొచ్చిన అధికారులను నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు జీఓ 111 పేచీ పెడుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది.
ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్, ధరణి పోర్టల్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల న్యాయకత్వంలో హయత్‌నగర్‌లో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొంగు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మీద గుదిబండ మోపుతూ ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిందని ఆరోపించారు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్జిల్లాల్లోని పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనలు చేశారు.