- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ సభలో ఉద్రిక్తత..
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిర్వహిస్తున్న డిజిటల్ మెంబర్ షిప్‌లో భాగంగా కాంగ్రెస్ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మంగళవారం మేడ్చల్ జిల్లాలోని కొంపల్లిలో శిక్షణ తరగతుల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. పలువురు కాంగ్రెస్ నేతలు శిక్షణ తరగతులకు పాస్‌లు ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు.
మండల అధ్యక్షులను పక్కన పెట్టి కొత్త వారికి పాస్ ఇచ్చారని, పొన్నాల లక్ష్మయ్య వర్గానికి చెందిన వారికి మాత్రమే పాసులు ఇచ్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గానికి చెందిన వారిమి కాబట్టే తమకు పాస్‌లు ఇవ్వలేదంటూ మరికొంత మంది కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మనలో మనం కొట్లాడుకుంటే చులకనైపోతామని అన్నారు. అందరం కలసికట్టుగా టీఆర్ఎస్, బీజేపీలపై పోరాటం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ఓ తాగుబోతు నిన్న చిల్లర మాటలు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. ఆయనకు గుణపాఠం చెప్పేలా అందరం కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. మన ఇంట్లోనే మనం గొడవపడేలా చేయవద్దని.. ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకోబోమని పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని తెలిపారు.