- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య బయట తిరగొద్దన్నందుకు.. భర్త ఆత్మహత్య
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బయట తిరగొద్దు.. రోజులు బాగాలేవు.. వైరస్ సోకితే ప్రాణాలు పోతాయని ఓ భార్య తన భర్తకి జాగ్రత్తలు చెప్పింది. అంతే ఆమె మాటలకు మనస్తాపానికి గురైన భర్త చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాయపోల్ ఎస్ఐ వివరాల ప్రకారం.. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద రాములు(60) కుమారుడు రాజుతో కలిసి గజ్వేల్‌లో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో వారి దుకాణం మూతపడింది. దీంతో రాములు కుటుంబంతో కలిసి తన స్వగ్రామమైన లింగారెడ్డిపల్లికి చేరుకున్నాడు. గ్రామంలో ఇంటి వద్దే ఉండకుండా రాములు తరచూ బయట తిరుగుతున్నాడు. దీంతో రాములు భార్య అంజమ్మ కరోనా వైరస్ వ్యాపిస్తున్న వేళ బయట ఎందుకు తిరుగుతున్నావంటూ భర్తను ప్రశ్నించింది. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్య తనను ప్రశ్నించడమేంటని మనస్తాపం చెందిన రాములు బుధవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Tags : Stir, husband and wife, Husband dead, corona virus, gajwel, medak