- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS : 'ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్వాకం'.. ఆ యువతి బాధ వర్ణనాతీతం (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: స్వరాష్ట్ర సాధనతో తమ ప్రాంత ఇబ్బందులన్నీ తొలగి అభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలోని మారుమూల గ్రామాల ప్రజలు అనుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరాయా?.. ఓ గ్రామం అభివృద్ధి చెందాలన్నా.. వైద్య పరిస్థితులు మెరుగుపడాలన్నా రోడ్డు సదుపాయం తప్పనిసరి. అయితే రాష్ట్రంలో ఇంకా ఎన్నో మారుమూల గ్రామాలు రోడ్డు సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని కనులకు కట్టినట్టు చూపించే విధంగా చెన్నూరు నియోజకవర్గంలో ఓ ఘటన జరిగింది.
గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులన్నీ నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. వరదలు పొంగి పొర్లుతున్నాయి. అయితే చెన్నూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నిట్టూరి ప్రవళిక అనే యువతికి ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు 108 కి ఫోన్ చేశారు. ఒక్కసారిగా వాగు పొంగిపొర్లుతుండటంతో రోడ్డు మునిగిపోయి అంబులెన్స్ రాలేకపోయింది. అయితే అక్కడి పరిస్థితులపై ఆ యువతి కుటుంబసభ్యుడొకరు వీడియో తీసి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ “చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన నిర్వాకంతో మా పరిస్థితి ఇలా ఉందని.. సీరియస్ గా ఉందని.. అంబులెన్స్ రాలేకపోవడంతో చేసేదేమీ లేక ఇద్దరు ఈదుకుంటూ యువతిని వాగు దాటించి అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్లారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
— Ravula Thirupathi.goud (@RavulaThirupa17) September 4, 2021
— Ravula Thirupathi.goud (@RavulaThirupa17) September 4, 2021