- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాండమిక్ తర్వాత కూడా..
కరోనా వైరస్ పాండమిక్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, అలాగని పనులన్నీ ఆపుకొని కూర్చోలేం కదా.. అందుకే టెక్నాలజీ సాయంతో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్ అంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నష్టాలు భరించలేక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నప్పటికీ మంచి టాలెంట్ వారిని నియమించుకునేందుకు కంపెనీలు వెనక్కితగ్గడం లేదు. అందుకే టాలెంట్ ఉన్న వారి కోసం వెతుకులాటను వర్చువల్‌గానే చేస్తున్నాయి. అయితే ఇలా వర్చువల్‌గా మీటింగ్స్, ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాల్లోకి తీసుకోవడాన్ని పాండమిక్ తర్వాత కూడా కంటిన్యూ చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
సంప్రదాయ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోవడానికి ఒక్కో రౌండ్‌కు ఒక్కోసారి అభ్యర్థిని ఆఫీస్ వరకు పిలుచుకోవడం, వారి కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం అనేవి చాలా ఇబ్బందికర పనులు. కానీ వర్చువల్‌గా ఉద్యోగులను హైర్ చేసుకోవడానికి రెండు నుంచి నాలుగుసార్లు గూగుల్ మీట్ లేదా జూమ్ కాల్ పెడితే సరిపోతుంది. కెరీర్‌నెట్ అనే ఒక కన్సల్టింగ్ కంపెనీ చేసిన సర్వేలో ప్రతి నాలుగింట మూడు కంపెనీలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ముఖ్యంగా ఐటీ, ఈ-కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీల్లో అభ్యర్థులను నియమించుకోవాలంటే ఆఫీస్ వరకు రావాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో అతని టాలెంట్‌ను అంచనా వేయొచ్చు. కాబట్టి ఇదే విధానాన్ని పాండమిక్ తర్వాత కూడా అమలు చేయడానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని కెరీర్‌నెట్ సీఈఓ అన్షుమన్ దాస్ అంటున్నారు. దాదాపు 60 శాతం ఉద్యోగులను ఇలా ఆన్‌లైన్‌లోనే హైర్ చేయడం వల్ల అన్ని రకాల ఖర్చులను తగ్గించుకోగలగడం కూడా ఒక కారణమని అన్షుమన్ తెలిపారు.