స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ట భద్రత

by Shyam |   ( Updated:2020-10-09 09:53:51.0  )
స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ట భద్రత
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, పోలీస్ ఎన్నికల నోడల్ అధికారి ఏసీపీ బాలాజీ, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్ తో కలసి సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు గురించి అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో తనిఖీ చేయాలని, ఎల్లవేళలా లైటింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story