రికవరీకి మూడేళ్లు పట్టొచ్చు -అనుజ్

by Harish |   ( Updated:2020-10-22 05:16:24.0  )
రికవరీకి మూడేళ్లు పట్టొచ్చు -అనుజ్
X

దిశ, వెబ్‌డెస్క్: వాణిజ్య వాహనాల అమ్మకాలు ప్రతి నెలా మెరుగైన వృద్ధిని సాధిస్తున్నాయని దేశీయ రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలండ్ గురువారం వెల్లడించింది. అయితే, కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకోలేదని, గత ఆర్థిక సంవత్సరం అమ్మకాల స్థాయికి చేరుకోవడానికి 2-3 ఏళ్ల సమయం పట్టే అవకాశముందని కంపెనీ పేర్కొంది.

ఈ-కామర్స్, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల విభగాల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తేలికపాటి, ఓ మోసతరు వాణిజ్య వాహనాల అమ్మకాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నాయని కంపెనీ తెలిపింది. మీడియా రేంజ్, భారీ ట్రక్కుల వంటి అమ్మకాల డిమాండ్ తక్కువగా ఉంది, రహదారి నిర్మాణాలు, మైనింగ్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఈ విభాగం అమ్మకాల్లో రికవరీ ఉంటుందని కంపెనీ తెలిపింది.

‘ప్రతి నెలా డిమాండ్ మెరుగుపడుతోంది. మీడియం, భారీ వాణిజ్య వాహనాల విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ స్థాయిలను మళ్లీ చేరుకోగలమా లేదా అనేది చూడాలు. ప్రధానంగా మీడ్ కమర్షియల్ వెహికల్స్ విభాగంలో రికవరీ వేగంగా నమోదవుతోంది’ అని అశోక్ లేలండ్ సీఈవో అనుజ్ కతురియా చెప్పారు.

Advertisement

Next Story