‘అద్దంలా కనిపించేలా చూసుకోవాలి’

by Shyam |   ( Updated:2020-06-03 08:46:01.0  )
‘అద్దంలా కనిపించేలా చూసుకోవాలి’
X

దిశ, మెదక్: ప్రతిఒక్కరూ తమ ఇంటిలాగే గ్రామంలోని ప్రతి వీధిని శుభ్రంగా.. అద్దంలా కనిపించేలా శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం కంది మండలం ఎద్దుమైలారం గ్రామాన్ని సందర్శించి గ్రామం మొత్తం కలియ తిరుగుతూ పారిశుధ్య నిర్వహణ, తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య భద్రతకు పరిశుభ్రతను మించిన మందు లేదన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో దోమలు వ్యాపించకుండా ఎవరికీ వారు శుభ్రత పాటించాలన్నారు. గ్రామంలో ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, మురుగు కాలువలలో చెత్త ఎప్పటికప్పుడూ తొలగించాలని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వాహణ, హరితహారం మొక్కల సంరక్షణ బాగున్నాయని ఎంపీపీ, సర్పంచ్‌లను అభినందించారు. అనంతరం హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధం చేయాలని సంబంధితులకు కలెక్టర్ ఆదేశించారు. కంది మండలం కవలంపేట గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పెట్టిన మొక్కలను పరిశీలించారు.

Advertisement

Next Story