- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనకోసం ప్రాణాలర్పించే హీరోలు వాళ్లే.. కలెక్టర్ శశాంక ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, మహబూబాబాద్ టౌన్: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రలోని ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్ డే) నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శశాంక పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరులైన 377 మంది జవాన్ల పేర్లు ఉన్న పుస్తకాన్ని ఎస్పీ ఎన్.కోటిరెడ్డికి అందించారు. అనంతరం ఎస్పీ 377 మంది వీర జవాన్ల పేర్లు చదివి స్మరించుకున్నారు. అనంతరం కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల త్యాగాలు, వారు దేశానికి, ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అన్ని శాఖల కంటే పోలీస్ శాఖ విధులు బాధ్యతతో కూడినవని చెప్పారు. పోలీసుల వల్లే సమాజంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. అందుకే అందరూ పోలీసులను గౌరవించాలని కోరారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలు సైతం అడ్డుపెట్టి ప్రజలను, ప్రజా ప్రతినిధులను కాపాడుతారని, వాళ్లే మన హీరోలు అని గుర్తుచేశారు.
జిల్లా ఎస్పీ కోటిరెడ్డి నేతృత్వంలో గత ఐదేళ్లుగా జిల్లా ప్రజల పరిరక్షణ కోసం పోలీసులు పనిచేయడం క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. ప్రాణాలకు తెగించి, ఏ పరిస్థితుల్లోనైనా వెనకడుగు వేయకుండా అసాంఘిక శక్తులతో పోరాడి ఎన్నో విజయాలు సాధించారన్నారు. పోలీసులు త్యాగం చేయని రోజంటూ ఉండదని కొనియాడారు. సెలవులు, పండుగ దినాలు కూడా పనిచేస్తూ.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, అవిశ్రాంతంగా పనిచేస్తారని అన్నారు. అనంతరం క్రీడాపోటీల్లో విజయం సాధించిన వారికి మొదటి బహుమతి కింద రూ.20,000, ద్వితీయ బహుమతి రూ.10,000 లతోపాటు జ్ఞాపికను అందించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పూలతో నివాళులులర్పించారు. పరేడ్‌లో భాగంగా అందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీ సదయ్య, జనార్దన్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.