భక్తులకు అసౌకర్యం కల్గకుండా చూడండి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్

by  |
భక్తులకు అసౌకర్యం కల్గకుండా చూడండి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
X

మేడారం జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.

జాతర ఏర్పాట్లపై వైద్య,ఆర్ డబ్ల్యుఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్, నోడల్ అధికారి వీపి గౌతమ్ సమీక్షించారు. రేపటి కల్లా 100శాతం సిబ్బంది కేటాయించిన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. జాతరలో రానున్న మూడు రోజులు కీలకమని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారి వీపీ గౌతమ్, ఓఎస్డి కృష్ణ ఆదిత్య, పీఓ ఐటీడిఏ హనుమంతు కొండిబా, చక్రధర్ రావు, డిఎఫ్ఓ ప్రదీప్ శెట్టి, ట్రైనీ కలెక్టర్లు సురభి ఆదర్శ్, శ్రీహర్ష, డియంహెచ్ఓ అప్పయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ఎస్ఈ రాంచంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతర పుస్తకావిష్కరణ..

మేడారం వనదేవతలైన శ్రీ సమ్మక్క…సారలమ్మ జీవిత చరిత్రతో కూడిన జాతర విశేషాలను సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక పుస్తక రూపంలో తీసుకొచ్చింది. దానిని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ , నోడల్ అధికారి వి.పి.గౌతమ్, ఏటూరునాగారం ఐ.టి.డి.ఏ.పీవో హనుమంతు కొండిబా జడ్ లు మంగళవారం ఐ.టి.డి.ఏ. క్యాంపు కార్యాలయం అతిథి గృహంలో ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed