కరోనా బాధితులతో కలెక్టర్ ఫోన్ ఇన్

by Shyam |   ( Updated:2020-08-10 08:40:24.0  )
కరోనా బాధితులతో కలెక్టర్ ఫోన్ ఇన్
X

దిశ, భువనగిరి: లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా కరోనా వైరస్‌తో బాధితుల ఇబ్బందులు తెలుసుకునేందుకు కూడా కలెక్టరేట్‌లో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అనితా రామచంద్రన్ కరోనా బాధితులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలసుకున్నారు. అనంతరం పలువురికి కరోనా అవగాహన కల్పించారు. అంతేగాకుండా బాధితుల పరిస్థితి విషమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story