జర్నలిస్టులకు అండగా ప్రభుత్వం

by Sridhar Babu |   ( Updated:2021-05-21 06:22:48.0  )
జర్నలిస్టులకు అండగా ప్రభుత్వం
X

దిశ,కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ చురుకుగా పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. జిల్లా అక్రిడేషన్ కమిటీతో కొత్త కార్డుల కేటాయింపు, కోవిడ్ సహాయక చర్యల గురించి ఆయన డీపీఆర్వో శ్రీనివాస్ నేతృత్వంలో శుక్రవారం అక్రిడేషన్ కమిటీ, డీఎంహెచ్ ఓ, సంయుక్త కలెక్టర్ అనుదీప్, జీసీ వెంకటేశ్వర్లు తో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. జర్నలిస్టులకు ఆక్సిమీటర్లు, ధర్మామీటర్లు అందజేసేందుకు కృషి చేస్తామని, కోవిడ్ నేపథ్యంలో జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, వ్యాక్సినేషన్ లోనూ జర్నలిస్ట్ ల కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అర్హులైన జర్నలిస్ట్ లు అందరికీ అక్రిడేషన్ లు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవైనా లోటుపాట్లు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పలు విషయాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ జూమ్ మీటింగ్ లో టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) పక్షాన చేసిన సూచనలను జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆమోదించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story