కలెక్టరేట్ భవన నిర్మాణ వేగం పెంచాలి

by Shyam |
కలెక్టరేట్ భవన నిర్మాణ వేగం పెంచాలి
X

దిశ, నాగర్‌ కర్నూల్‌: జిల్లాల్లో ఇళ్లు లేని నిరు పేదలకు పక్క ఇళ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నాగర్‌ కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్.శర్మన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెండు పడకల గదులు, నూతన కలెక్టరేట్‌, నిర్మాణాల పనులపై కలెక్టర్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 4,816 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా.. అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు ఇచ్చిన 3,676 డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందులో వివిధ దశల్లో కొనసాగుతున్న పనులను రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను, కాంట్రాక్టర్‌లను కలెక్టర్‌ ఆదేశించారు. నిర్మాణ ప్రదేశాలను స్వయంగా తనిఖీ చేసి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను అందజేస్తానని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్‌ సముదాయ నిర్మాణాలపై సమీక్షించారు. నూతన కలెక్టరేట్‌ సముదాయ భవనం నిర్మాణ పనులపై కలెక్టర్‌ పనుల్లో ఏమాత్రం పురోగతి లేదని ఇప్పటివరకూ లేంటల్ లెవెల్ పనులు మాత్రమే జరిగాయన్నారు. నిర్మాణ పనులు పురోగతి సాధించాలని పనులను నిర్విరామంగా కొనసాగించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed