ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దు

by Sampath |
ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కల్గించొద్దు
X

దిశ, మేడ్చల్ : లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులకు పండించిన వరి కొనుగోలులో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. నిజంగా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం స్థానికంగా ఉన్న 2రేషన్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడి.. కుటుంబంలో మనిషికి 12 కిలోల బియ్యం ఇవ్వడం పట్ల మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఇక ముందు కూడా పారిశుధ్య కార్మికులు తమ వంతు సహయ, సహకారాలు అందించాలన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, తహశీల్దార్ విజయలక్ష్మీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, medchal collecter vasam venkateshwarlu, rice purchase centers

Advertisement

Next Story

Most Viewed