- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్‌లో కరోనా కేసుల కలకలం.. కలెక్టర్ కర్ణన్ కీలక ఆదేశాలు
దిశ, కరీంనగర్ సిటీ : జిల్లాలో ప్రతీరోజు నిర్వహించే కొవిడ్ నిర్ధారణ పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్‌లతో కొవిడ్ నియంత్రణ చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్ కేసులు, ప్రైమరీ కాంటాక్ట్ కేసుల గుర్తింపు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ మెడికల్ ఆఫీసర్‌లను ఆదేశించారు. మానకొండూరు మండలంలో ఎక్కువ కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ చెప్పారు.
కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారందరినీ హోమ్ ఐసోలేషన్‌లో లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ కొవిడ్ కిట్స్ అందజేయాలని, మందులు వాడే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలని సూచించారు. ఇంటింటి జ్వర సర్వేను కూడా కొనసాగించాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.