- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రీసైకిల్డ్ మెటీరియల్‌తో కోక్ బాటిల్స్
దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలనేది పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో కార్పొరెట్ కంపెనీలు కూడా వీలైనంత మేరకు ‘ఎకో ఫ్రెండ్లీ’ ఉత్పత్తుల వైపు దృష్టిసారిస్తే ‘ప్లాస్టిక్ పొల్యూషన్’ను కొంతైనా తగ్గించుకోవచ్చు. ఈ దిశగా కోకాకోలా కంపెనీ ఓ ముందడుగు వేసింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా 100% రీసైకిల్ పదార్థంతో తయారు చేసిన బాటిల్‌ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
కోకాకోలా సంస్థ.. తమ ప్లాస్టిక్ బాటిళ్లను కాగితపు సీసాలతో భర్తీ చేస్తున్నామని, ఇందుకోసం ‘పబోకో’ అనే సంస్థతో జతకట్టినట్లు తెలిపింది. 100% రీసైకిల్ మెటీరియల్‌తో తయారుచేసిన బాటిల్స్(13.2 ఔన్స్)ను నార్త ఈస్ట్, ఫ్లోరిడా, కాలిఫోర్నియాలోని కన్వీనియెన్స్ స్టోర్లలో ఫిబ్రవరి చివరి వారంలోగా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. కోక్, డైట్ కోక్, కోక్ జీరో షుగర్ కోసం ఈ ప్లాస్టిక్ ఫ్రీ కొత్త బాటిల్స్‌ను ఉపయోగిస్తుండగా, మరికొన్ని రోజుల్లో స్ర్పైట్‌ను కూడా 100% రీసైకిల్ బాటిళ్లలో తీసుకొస్తామని వెల్లడించింది. ఈ మేరకకు 2025 నాటికి 100% రీసైకిల్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను వాడటంతో పాటు 2030 నాటికి 50% రీసైకిల్ పదార్థాలతో తయారుచేసిన సీసాలు, క్యాన్స్ ఉపయోగిస్తామని కోకాకోలా ప్రతినిధులు తెలిపారు.
‘తొలిగా తయారుచేస్తున్న ఈ పేపర్ బాటిల్ ప్రోటోటైప్‌లో బయట లేయర్ పేపర్ కాగా, లొపలి లేయర్ మాత్రం ప్లాస్టిక్. మేము ఉపయోగించే ఈ ప్లాస్టిక్, 100% రీసైకిల్ ప్లాస్టిక్ నుంచి తయారవుతుంది. దీన్ని ఉపయోగించిన తరువాత మళ్లీ రీసైకిల్ చేయవచ్చు. కానీ మా దృష్టి పేపర్‌లాగా రీసైకిల్ చేయగల పేపర్ బాటిల్‌ను సృష్టించడం. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ లైనర్ లేకుండా బాటిల్‌ను సృష్టించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని ఆర్ అండ్ డీ ప్యాకేజింగ్ ఇన్నోవేషన్ మేనేజర్ స్టిజ్న్ ఫ్రాన్సెన్ అన్నారు.
‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’ అనే స్వచ్ఛంద సంస్థ సర్వేలో కోకాకోలా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకంగా నిలవగా.. మెజారిటీ దేశాల్లోని బీచ్‌లు, నదులు, ఉద్యానవనాలు, ఇతర ప్రదేశాల్లో కోకాకోలా సీసాలు ఎక్కువగా కనిపిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. ఈ వార్త వచ్చిన కొద్ది రోజుల్లోనే కోకాకోలా కంపెనీ ‘ప్లాస్టిక్ ఫ్రీ బాటిల్స్’ తీసుకొస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 2020లోనే కాదు గత మూడేళ్లుగా ఈ సర్వేలో ‘కోకాకోలా’నే టాప్ పొజిషన్‌లో కొనసాగుతుండగా.. పెప్సికో, నెస్లేలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ సంస్థలే ప్రపంచ ప్లాస్టిక్ పొల్యూషన్‌కు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇదే విధమైన సర్వేను ఇంటర్నేషనల్ ఎయిడ్ ఏజెన్సీ టియర్‌ఫండ్.. మార్చి 2020లో చేపట్టగా అందులోనూ కోకాకోలా, పెప్సికో, నెస్లే, యునీలివర్ కంపెనీలు ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమని వెల్లడైంది.