- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిర్యాల గని ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎండీ
దిశ, గోదావరిఖని: శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ పీ-3 గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ సీఎండీ శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.
మృతి చెందిన కార్మిక కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని, కంపెనీ ద్వారా చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణమే వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించారు. కార్మికుని మృతి ఆ కుటుంభంలో తీవ్ర శోకం నింపుతుందని వారు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. వారికి సింగరేణి యాజమాన్యం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేగాకుండా.. బాధితుల కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పిస్తామని సీఎండీ శ్రీధర్ హామీ ఇచ్చారు. అలాగే మృతుల కుటుంబాలకు సుమారు రూ.70 లక్షల నుండి కోటి రూపాయల వరకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.