కన్నడ సర్కార్‌కు మరోసారి అవిశ్వాస పరీక్ష..!

by Anukaran |   ( Updated:2020-09-26 05:19:26.0  )
కన్నడ సర్కార్‌కు మరోసారి అవిశ్వాస పరీక్ష..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కరోనా నియంత్రణలో యడియూరప్ప సర్కార్ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆర్థికాభివృద్ధి కూడా కుంటు పడిందని విమర్శించింది. ఈ నేపథ్యంలోనే యడియూరప్ప సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అవిశ్వాసం తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పీకర్‌కు నోటీసులిచ్చారు.

గత వారంలో ఓ కేంద్ర మంత్రిని, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యేను కోల్పోయామని గుర్తుచేశారు. అంతేకాకుండా కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలో రూ.2,000 కోట్ల అవినీతి జరిగిందని సిద్దరామయ్య ఆరోపించారు. అయితే, ఈ విమర్శలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అవిశ్వాసం అనేది ఓ ‘రాజీకయ జిమ్మిక్కని’ మండిపడింది. కాంగ్రెస్‌కు సరైన సంఖ్యా బలం లేకపోయినా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం యడియూరప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు.

అంతేకాకుండా ‘అవిశ్వాసం పెట్టినా తమకు అభ్యంతరం లేదు.’ అని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. ”నాకేమీ అభ్యంతరం లేదు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టమనండి. ప్రతి ఆర్నెళ్లకోసారి అవిశ్వాసం అంటారు. మరో ఆరు నెలల పాటు నేను సేఫ్‌గా ఉంటాను” అని యడియూరప్ప వెల్లడించారు.

Advertisement

Next Story