- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయిపై ఫోకస్.. పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు కేసీఆర్ బంపర్ ఆఫర్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రాన్ని గంజాయి, మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఈ క్రమంలో ప్రగతిభవన్‌లో బుధవారం ఎక్సైజ్ అధికారులు, పోలీసులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అధికారులంతా గంజాయిపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. పరిస్థితి సీరియస్ అవ్వకముందే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత గంజాయి కోసం వాట్సాప్ సందేశాలు పంపుకుంటున్నారని, డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అణిచివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా నేరస్థులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యాసంస్థలు, చెక్‌పోస్టుల వద్ద ముఖ్యంగా నిఘా పెట్టాలని, అందుకోసం నిఘా విభాగంలోనూ డ్రగ్స్‌పై ప్రత్యేక విభాగం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. గంజాయిని కట్టడి చేసే పోలీసు, ఆబ్కారీ అధికారులకు ప్రోత్సాహకాలు, నగదు బహుమతులు, ప్రత్యేక పదోన్నతులు ఉంటాయని ప్రకటించారు.