రేపు వ‌రంగ‌ల్‌కు సీఎం.. ఎంజీఎం, సెంట్ర‌ల్‌జైల్‌ సందర్శించ‌నున్న కేసీఆర్‌

by Ramesh Goud |   ( Updated:2021-05-20 08:05:48.0  )
రేపు వ‌రంగ‌ల్‌కు సీఎం.. ఎంజీఎం, సెంట్ర‌ల్‌జైల్‌ సందర్శించ‌నున్న కేసీఆర్‌
X

దిశ, వ‌రంగ‌ల్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈనెల 21న వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈసంద‌ర్భంగా శుక్ర‌వారం ఎంజీఎం ఆస్ప‌త్రితో పాటు సెంట్ర‌ల్ జైలును ముఖ్య‌మంత్రి సంద‌ర్శిస్తార‌ని అధికారులు వెల్ల‌డించారు. వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రిలోని కోవిడ్ రోగుల‌కు అందుతున్న వైద్యాన్ని, ఆస్ప‌త్రిలోని స‌దుపాయాల‌పై ముఖ్య‌మంత్రి నేరుగా ప‌రిశీలించనున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంజీఎంను సంద‌ర్శించ‌నున్న‌నేప‌థ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు వైద్యాధికారుల‌తో ఆస్ప‌త్రిలో భేటీ అయ్యారు. ఎంజీఎంతో పాటు, సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించి ప‌రిశీలించారు. మంత్రి ద‌యాక‌ర్‌రావు ఈ సంద‌ర్భంగా పీపీటీ కిట్ ధ‌రించి నేరుగా కోవిడ్ వార్డులో ప‌ర్య‌టించారు.

Advertisement

Next Story