- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు హాలియాకు సీఎం కేసీఆర్.. నాటి హామీలకు నేడు పునాది పడబోతుందా..?
దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ నేడు సాగర్ నియోజకవర్గంలోని హాలియాకు రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న హాలియాలో జరిగిన సభలో 15 రోజుల్లోనే సాగర్‌కు వచ్చి హామీలన్నింటిని అమలు చేస్తానని చెప్పినప్పటికీ రాలేదు. మూడున్నర నెలల తర్వాత సాగర్ పర్యటనకు వస్తున్నారు. అయితే సీఎం ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడనే గంపెడాశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. సాగర్‌లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా… మీ బిడ్డగా హామీ ఇస్తున్నా.. నియోజకవర్గ నేతలను పిలిచి చేయిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
2021 ఏప్రిల్14న హాలియాలో ఇచ్చిన హామీలు ఇవే…
1.తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు లిప్టును ఏడాదిన్నరలో పూర్తి చేస్తా.
2.నాగార్జున సాగర్‌లోని ఇరిగేషన్ భూముల సమస్యలు పరిష్కరిస్తాం, ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలిస్తా.
3.నందికొండలోని బీసీ కులాల్లో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తా.
4.హాలియాలో షాదీఖానా, ఖబ్రస్తాన్ నిర్మిస్తాం.
5. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పింఛన్లు ఇస్తాం.
6. పదిహేనురోజుల్లోనే సాగర్‌కు స్వయంగా వచ్చి అభివృద్ధికి శ్రీకారం చూడతా.
7.సాగర్ ఆయకట్టుకు పాలేరు నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి పెద్దదేవులపల్లి చెరువును నింపుతా.
8. నెల్లికల్లుతో పాటు దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడలో లిప్టులను పూర్తి చేయించి సాగునీరందేలా చర్యలు తీసుకుంటాం.
9. గిరిజనుల పోడుభూముల సమస్య పరిష్కారానికి సాగర్‌లో ‘ప్రజాదర్భార్’పెట్టి పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు హామీలు అమలు కాలేదు. హామీల అమలుకోసం నేడు హాలియాకు 10.45 గంటలకు చేరుకొని సాగర్ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. అమలుకు కార్యాచరణ రూపొందిస్తారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.