- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ భవన్‌కు రండి చర్చిద్దాం.. వారందరికి కేసీఆర్ ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో : దళితుల సంక్షేమం కోసం వేలకోట్ల రూపాయలు వెచ్చించి దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దళితుల్లో మిశ్రమ స్పందన ఉంది. వారందరిని టీఆర్ఎస్ వైపునకు మళ్లించేందుకు ఏం చేద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో నేడు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలను ఎలా వాడుకుందామనే అంశంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషి పై సుదీర్ఘంగా చర్చిస్తారు.
- Tags
- dalita bandhu
- KCR