వ్యవసాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష

by Anukaran |   ( Updated:2020-07-11 08:32:23.0  )
వ్యవసాయంపై సీఎం కేసీఆర్ సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రగతి భవన్‎లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర వ్యవసాయ విధానంపై కేసీఆర్.. సంబంధిత అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయి. కేసీఆర్‌లో పాటు ఈ సమావేశంలో సీఎస్ సో మేశ్ కుమార్, పల్లారాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు.. ఏయే పంటలు వేశారో అన్న దానిపై సీఎం ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సన్నరకం, వరి పత్తిపంట సాగుపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి ఫామ్ హౌజ్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. ముందుగా వ్యవసాయంపై సమావేశం నిర్వహించడం గమనార్హం.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నియంత్రిత పద్ధతిలో పంటసాగు చేయడం శుభసూచకం అన్నారు. విత్తనాలు నిల్వ చేసేందుకు త్వరలో రూ. 25 కోట్లతో.. అతిపెద్ద అల్ట్రా మోడరన్ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపడుతామని చెప్పారు. అలాగే, దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, రైతు బంధు సాయం అందని రైతులను గుర్తించి.. వారికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story