కామారెడ్డికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న కేసీఆర్..

by Shyam |   ( Updated:2021-07-08 08:02:08.0  )
CM-Kcr-Vasalamarri
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖ‌ర్ రావు జూన్ 20న కామారెడ్డి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆరోజు సీఎం ఇచ్చిన హామీల అమ‌లు మేరకు కామారెడ్డి జిల్లాకు రూ.152.60 కోట్ల నిధులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలోని 526 గ్రామ పంచాయితీలకు ఒక్కొక్క పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులను కేటాయించనున్నారు.

అదే విధంగా కామారెడ్డి మున్సిపాలిటీకి స్పెషల్ గ్రాంట్ కింద రూ.50 కోట్లు, కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, శాసనసభ్యులు షిండే, సురేందర్‌లు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story