పీఆర్సీ జీవోలు విడుదల చేయాలి

by Shyam |   ( Updated:2021-04-27 07:50:33.0  )
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ జీవోలను సత్వరమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మార్చి 22న సీఎం కేసీఆర్ ఏప్రిల్ నెల వేతనాలను నూతన పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పొందుతారని ప్రకటించారని, నేటి వరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాలేదన్నారు.

2018 జూలై 1 నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ 33 నెలలు ఆలస్యమైందని, మధ్యంతర భృతి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా కనీసం పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు సకాలంలో వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైందని తెలిపారు. ఇప్పటికైన స్పందించి పీఆర్సీ సిఫార్సులు, కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా వెంటనే నూతన వేతనాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు కె.లక్ష్మయ్య, సీహెచ్ సంపత్ కుమారస్వామి, జి.సదానందంగౌడ్, కె.జంగయ్య, కె.రమణ, జె.వెంకటేశ్, చావ రవి, టి.శుభాకరరావు, పి.పర్వతరెడ్డి, ఎం.రఘుశంకర్ రెడ్డి, టి.లింగారెడ్డి, కె.కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్, ఎం.రాధాకృష్ణ, చంద్రశేఖర్, యు.పోచయ్య, డి.సైదులు, షౌకత్ అలీ, ఎన్.చెన్నరాములు, ఎస్.మధుసూదన్ రావు, డాక్టర్ పి.పురుషోత్తం, జి.నిర్మల, తాజ్ మోహన్ రెడ్డి, జి.ఉపేందర్, ఆర్.కృష్ణారెడ్డి, భూపాల్, కె.యాదానాయక్, పి.భాస్కర్, ఆర్.వెంకట్ రెడ్డి, ఆర్.ఈశ్వర్, యాదగిరి గౌడ్, కె.మహిపాల్ రెడ్డి, చక్రవర్తుల శ్రీనివాస్, ఇ.లక్ష్మణ్ నాయక్, జాడి రాజన్న, వెంకట్రావు జాదవ్, కొమ్ము రమేశ్, మహమ్మద్ తాహెర్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed