శాంతిభద్రతల పరిరక్షణలో మనమే ఆదర్శం

by Shyam |
శాంతిభద్రతల పరిరక్షణలో మనమే ఆదర్శం
X

దిశ, వెబ్‌డెస్క్: శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మహిళల భద్రతను ప్రాధాన్యత అంశంగా తీసుకొని పనిచేస్తుందని, ఇంకా మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బుధవారం పోలీస్, అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సందర్భంగా సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. అటవీ సంపద కొల్లగొట్టే వారి పట్ల మరింత కఠినంగా ఉండాలన్న సీఎం… స్మగ్లింగ్‌ను అరికట్టడంలో సివిల్‌ పోలీసులు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. గత పాలకులు కలప స్మగ్లింగ్‌ను పట్టించుకోక పోవడంతో కొందరికి అలుసుగా మారిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం స్మగ్లింగ్‌ను సీరియస్‌గా తీసుకుందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటు అనంతరం పోలీసులు సాధించిన ఘనవిజయాల్లో గుండుంబా నిర్మూలన కూడా ఉందని, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడా గుడుంబా తయారీ జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించి గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఫేక్ సర్టిఫికెట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీలో ఆలస్యం తగదన్నారు. హైదరాబాద్‌లో 10లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, త్వరలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వినియోగంలోకి వస్తుందన్నారు. దేశంలో దళితులపై దాడులు శోచనీయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed