సీఎం కేసీఆర్ మరోసారి అత్యున్నత సమావేశం

by Shyam |
సీఎం కేసీఆర్ మరోసారి అత్యున్నత సమావేశం
X

కరోనా వైరస్‌ దృష్ట్యా తెలంగాణలో విధించిన లాక్‌డౌన్‌పై పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ మరోసారి అత్యున్నత సమావేశం కానున్నారు. అత్యవసరంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‎లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, సీఎస్, డీజీపీ తదితరులు పాల్గొంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.

Tags: CM KCR, once again, highest meeting, lockdown, telangana

Advertisement

Next Story

Most Viewed