పారాసిటమాల్ చాలు.. మరోసారి తేల్చిచెప్పేసిన కేసీఆర్

by Shyam |   ( Updated:2021-06-21 05:32:51.0  )
CM-Kcr
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ మళ్లీ ‘పారాసిటమాల్‌’పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గుతుందని మరోసారి తేల్చిచెప్పేశారు. తనకు కూడా కరోనా వచ్చిందని, కరోనా వస్తే జస్ట్ టెంపరేచర్ మాత్రమే పెరుగుతుందని చులకనగా తీసేశారు. తనకు కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకోమని డాక్టర్ చెప్పారన్నారు. కరోనాకు మందు లేదని, తాను కేవలం పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నానని కేసీఆర్ తెలిపారు.

వరంగల్ పర్యటలో భాగంగా సభలో మాట్లాడిన కేసీఆర్.. వైద్యరంగం మీద దాడి సరికాదని, ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేశారని చెప్పారు. ‘ఆశా వర్కర్లకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కరోనాపై హెల్త్, పోలీస్ డిపార్ట్‌మెంట్లు అద్భుతంగా పనిచేశాయి. వారికి ధన్యవాదాలు’ అని కేసీఆర్ కితాబిచ్చారు. కరోనాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.

కాగా, కరోనా వస్తే పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కేసీఆర్ మాటలను విని అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు మరోసారి కేసీఆర్ ఆ వ్యాఖ్యలకు కట్టబడి ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed