రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

by Shyam |   ( Updated:2021-02-17 00:30:49.0  )
Happy Birthday KCR
X

దిశ,వెబ్‌డెస్క్: నేడు తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన, రక్తదాన శిబిరాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. బుధవారం తెల్లవారు జాము నుంచే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్‌లో టీఆర్ఎస్ నేతలు హోమాలు నిర్వహిస్తున్నారు. బల్కంపేట అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు చీరను సమర్పించారు. ఎల్లమ్మ అమ్మవారికి 2.5 కేజీల బంగారంతో చీర తయారీ చేయించారు. మరోవైపు మంత్రి తలసాని జలవీహార్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కోటి వృక్షార్చనలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడలోని మాతా శిశు ఆస్పత్రిలో మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు మొక్కలు నాటారు. ఇక మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని జామ తండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పల్లె నిద్ర చేశారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో కలిసి మొక్కలు నాటారు.

వరంగ్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం వ్యాప్తంగా 133 గ్రామాల్లోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పరకాలలోని కుంకుమేశ్వరస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోటి వృక్షార్చనలో భాగంగా దంపతులు మొక్కలు నాటారు.

Advertisement

Next Story

Most Viewed