- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపే ప్రమాణస్వీకారం.. తర్వాత కలుద్దామన్న సీఎం..!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కొత్త పాలకవర్గం శుక్రవారం కొలువుదీరనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీకి సమాచారమిచ్చారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన జనార్దన్‌రెడ్డితో పాటుగా ఏడుగురు సభ్యులు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాతే పదవీ బాధ్యతలు చేపట్టాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం సీఎం కేసీఆర్అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలోనే తర్వాత కలుద్దామని, ముందుగా పదవీ బాధ్యతలు స్వీకరించాలని సీఎం కేసీఆర్ కొత్త పాలకవర్గానికి సూచించారు. దీంతో ముహుర్తాలన్నీ చూసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయమే ప్రమాణస్వీకారం చేసేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులకు గురువారం ఉదయమం ఆదేశాలిచ్చారు. దీంతో రేపు టీఎస్పీఎస్సీలో 8 మంది పాలకవర్గం ఒకేసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.