తిరుమలలో సీఎం జగన్ పర్యటన..!

by srinivas |
తిరుమలలో సీఎం జగన్ పర్యటన..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఏపీ సీఎం జగన్‌ తిరుమలలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్‎పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లనున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస అనంతరం సాయంత్రం 5:27 గంటలకు అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6:15 గంటలకు పెద్దజియ్యర్ స్వామివారం మఠం చేరుకుని బేడి ఆంజనేయస్వామి దర్శించుకుంటారు. ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించి, గరుడ సేవలో పాల్గొననున్నారు.

గురువారం ఉదయం సీఎం జగన్ మరోసారి శ్రీవారిని దర్శించుకుని, నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొననున్నారు. కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి కర్ణాటక రాష్ట్ర చారిటీస్ సత్రాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతి వెళ్లనున్నారు.

Advertisement

Next Story