దాసరి సుధకు సీఎం అభినందనలు

by srinivas |
దాసరి సుధకు సీఎం అభినందనలు
X

దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డా. దాసరి సుధ ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన డా. దాసరి సుధకు, గెలుపులో కీలక పాత్ర పోషించిన నేతలకు అభినందనలు తెలిపారు. బద్వేలులో గెలుపొందిన అనంతరం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రులను సీఎం జగన్ అభినందించారు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్‌ను కలిశారు.

Advertisement

Next Story

Most Viewed