- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పు వాళ్లు చేస్తే శిక్ష మేము అనుభవిస్తున్నాం : సీఎం జగన్
దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం జగన్ హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు, అప్పుల వలన మేము శిక్ష అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీ సమస్యల వలయంలో చిక్కుకుందని, రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ధేశిత సమయంలో పరిష్కారం కావాలని కేంద్రానికి వివరించారు.అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు గడచినా హామీలు అమలు కాలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాలపై పరిమితి దాటిందని, దీంతో ఇప్పుడు తమకు రుణాలు రాకుండా కోత విధిస్తున్నారని సీఎం జగన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు కేవలం రెండు రాష్ట్రాలవి మాత్రమే కాదని జాతీయ అంశమని తెలిపారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు, సమస్యలను పరిష్కరిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.